రసవత్తరంగా సాగుతున్న పోరులో లవ్ ప్రపోసల్!

SMTV Desk 2019-06-24 13:31:17  Fan Proposes His Girlfriend During India-Pakistan Cricket Match

మాంచెస్టర్: ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్- ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ప్రేమ జంట ఒక్కటయ్యింది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో విక్కీ అనే యువకుడు తన ప్రియురాలు అన్వితకు వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీంతో ప్రియురాలు అంగీకరించడంతో ఆమె చేతి వెలికి ఉంగరం తొడిగాడు. దీంతో అతడిని గట్టిగా కౌగలించుకొని ముద్దల వర్షం కురిపించింది. ఈ జంటకు ప్రేక్షకులు, స్నేహితులు కేరింతలు కొడుతూ ఎంకరేజ్ చేశారు. దీంతో విక్కి ఆమెకు లిప్ లాక్ తో కిస్ ఇచ్చాడు. రసవత్తర మ్యాచ్‌లో ప్రేమ జంట ఆసక్తికర సన్నివేశం అందరికి నచ్చడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను అన్వితనే తన ట్వీట్టర్‌లో ట్వీట్ చేసింది.