చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చిన జగన్

SMTV Desk 2019-06-13 16:20:33  Jagan, Chandra Babu,

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే జగన్ సర్కార్ షాకిచ్చింది. చంద్రబాబు కాన్వాయ్‌లో రెండు వాహనాల్ని కుదించింది. జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు వాహనాల సంఖ్యను కుదించింది సర్కార్. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే సమయంలో రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్లే పైలట్ వాహనాన్ని ప్రభుత్వం తీసేసింది. అదొక్కటే కాకా ముందు వెళ్తున్న ఎనిమిది వాహనాల్లో ఏదైనా సమస్య తలెత్తినా వెనుకాల నుంచి గుర్తుతెలియని వాహనాలు ఏమైనా ఫాలో అయితే అప్రమత్తం చేస్తే ఎస్కార్ట్ వాహనాన్ని కూడా ప్రభుత్వం తగ్గించేసినట్లు సమాచారం. ఈరోజు అసెంబ్లీకి వచ్చే సమయంలో కూడా చంద్రబాబు ఈ రెండు వాహనాలు లేకుండానే సభకు చేరుకున్నారు. రెండు మూడురోజుల క్రితమే ప్రభుత్వం చంద్రబాబుకు భద్రత కుదించినా ఈ విషయం ఈరోజు బయటకు వచ్చింది. దీంతో చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారూ తెలుగుదేశం నేతలు. అయితే ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో ఆయనకు ఇదే కాన్వాయ్ ఉండేది కాబట్టి చంద్రబాబుకు కూడా ఇప్పుడు ఆ విధంగానే కాన్వాయ్ ఉండాలని వైసీపీ నేతలు లాజిక్ చెబుతున్నారు.