లంక మాజీ కెఫ్టెన్ రణతుంగ పై... భారతీయుల ఆగ్రహం

SMTV Desk 2017-08-29 18:45:13  Srilanka, India, Pallekele ODI, Arjuna Ranatunga, Social Media

శ్రీలంక, ఆగస్ట్ 29: పల్లెకెల వేదికగా భారత్-శ్రీలంకల మధ్య జరిగిన మూడవ వన్డే మ్యాచ్‌లో శ్రీలంక ఓటమికి చేరువగా ఉన్న సమయంలో సహనం కోల్పోయిన లంక అభిమానులు గ్రౌండ్ లోకి వాటర్ బాటిళ్లను విసిరిన సంగతి తెలిసిందే. దీంతో సుమారు 40నిమిషాల సమయం మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఈ నేపధ్యంలో లంక మాజీ కెఫ్టెన్ రణతుంగ స్పందిస్తూ... అభిమానులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని, ఓర్పుతో ఉండాలని విన్నవించారు. వరుస ఓటములు వస్తున్నప్పుడు ఆటగాళ్లు ఎంతో ఒత్తిడికి లోనవుతారని తెలిపారు. శ్రీలంక అభిమానులు భారత ప్రేక్షకుల్లా చేయరాదని, అది మన సంస్కృతికి విరుద్దమంటూ వ్యాఖ్యానించాడు. భారత క్రికెట్ అభిమానులను ఉద్దేశిస్తూ రణతుంగ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు సంధిస్తున్నారు. రణతుంగపై భారత నెటిజన్లు ఆగ్రహజ్వాలలు వెల్లకక్కుతున్నారు.