మద్యం మత్తులో ఒకే ఇల్లును ఇద్దరికి రాశిచ్చిన యజమాని!

SMTV Desk 2019-06-12 18:39:53  gyary mendage gives his own house papers to taxi driver

మద్యం మత్తులో కొందరు ఏం చేస్తుంటారో కూడా వారికే తెలియదు. అయితే ఓ వ్యక్తి ఇలాగే మద్యం మత్తులో ఓ టాక్సీ డ్రైవర్ కు ఏకంగా తన ఇంటినే రాసిచ్చాడు. అయితే ఇల్లు దక్కింది అని అన్న సంతోషం ఆ డ్రైవర్ కు ఎంత కాలం నిలువలేదు. ఎందుకంటే అదే ఇల్లును ఆ యజమాని మరొకరికి రాసిచ్చాడు. దీంతో కోర్టుకెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. వివరాల ప్రకారం....గ్యారీ మెండేజ్‌కు పబ్‌కు వెళ్లడం అలవాటు. కానీ ఆయన బరువు ఎక్కువగా ఉండటం వలన ట్యాక్సీ డ్రైవర్లు అతన్ని పబ్ తీసుకెళ్లడానికి సుముఖత చూపేవారు కాదు. కానీ, డీన్ హ్యూగ్స్ మాత్రమే అతడిపై జాలి చూపించి రోజు గ్యారీని పబ్‌కు తీసుకెళ్ళేవాడు. డీన్ హ్యూగ్స్ మంచితనానికి ఫిదా అయిన గ్యారీ 2016 ఫిబ్రవరిలో వెదర్‌స్పూన్స్‌ పబ్‌లో మందు కొడుతూ 1.4 కోట్ల విలువ చేసే తన ఇంటిని అతడి పేరున రాసేశాడు. ఇటీవల మెండేజ్ అనారోగ్యంతో మరణించడంతో ఈ విల్లును చూపించి ఇంటిని స్వాధీనం చేసుకోడానికి డీన్ ప్రయత్నించాడు. దీంతో మెండేజ్ పార్టనర్ రోడిగ్యూజ్ మరో విల్లుతో కోర్టును ఆశ్రయించాడు. డీన్‌కు విల్లు రాసిన మూడు నెలల తర్వాత 2016, మే నెలలో మెండేజ్ ఆ ఇంటిని తనకు రాసిచ్చిన్నట్లు రోడిగ్యూజ్ కోర్టుకు తెలిపాడు. మెండేజ్ రాసిన రెండు విల్లులను పరిశీలించిన కోర్టు రోడిగ్యూజ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పబ్‌లో మద్యం మత్తులో రాసిన బిల్లు చెల్లదని కోర్టు తెలిపింది. దీంతో టాక్సీ డ్రైవర్ నిరాశగా వెనుదిరిగాడు.