పాక్ పై చెలరేగిన ఆసిస్ ఓపెనర్లు...వార్నర్ సెంచరీ!

SMTV Desk 2019-06-12 18:38:50  Pakistan vs Australia, David Warner, Aron finch

టాంటన్‌: ప్రపంచకప్ లో భాగంగా బుధవారం టాంటాన్ వేదికగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మొదట ఇన్నింగ్స్ కు వచ్చిన ఆసిస్ ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వార్నర్, ఫించ్ తొలి వికెట్‌కు 17 ఓవర్లలోనే శతక భాగస్వామ్యం నెలకొల్పారు. వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై ఆసీస్ ఓపెనర్లు వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది ఐదోసారి కాగా.. 1996 తర్వాత ఇదే తొలిసారి. 1996 వరల్డ్ కప్‌లో స్మిత్-ఆథెర్టన్ జోడి పాక్‌పై తొలి వికెట్‌కు 147 పరుగులు జోడించగా.. ఇప్పుడు ఫించ్, వార్నర్ జోడి 146 పరుగులు జోడించింది. కాగా ఈ మ్యాచ్ లో వార్నర్ 111 బంతుల్లో 107 పరుగులు చేసి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఫించ్ కూడా 84 బంతుల్లో 82 పరుగులు చేసి సెంచరీ దిశగా వెళ్లి అమీర్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు.