ఇంగ్లాండ్ గడ్డ పై సత్తా చాటనున్న రిషబ్ పంత్

SMTV Desk 2019-06-12 18:36:29  rishab pant,

రిషబ్ పంత్ .. ఇప్పుడు భారత అభిమానుల్లో ఉండే పేరు .. ఎందుకంటే గాయం కారణంగా 3 వారాల పాటు రెస్ట్ తీసుకుంటున్న శిఖర్ ధావన్ ప్లేస్ లో వస్తున్నాడు ..ఆస్ట్రేలియాతో గత మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన ధవన్ ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ వేసిన బంతి ధవన్ చేతిని బలంగా తాకింది. గాయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మంగళవారం జరిపిన వైద్య పరీక్షల్లో వేలి ఎముకలో చిన్న చీలిక ఏర్పడినట్లు తేలింది. ఈ కారణంగా న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లకు ధవన్ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి.

ఈ మేరకు అతను ఇంగ్లాండ్ కి పయన మయ్యాడు పంత్ .. అయితే మంచి ఫామ్ లో ఉన్న గబ్బర్ వెనుతిరగడం ఒకింత ఆందోళన కలిగించే విషయం. కానీ రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అద్భుత ప్రదర్శన చేసాడు .. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన అతను ప్లే ఆఫ్స్ రేస్ వెళ్ళడానికి అతనే ఒకింత కారణం .. కళ్ళు చెదిరే షాట్స్ .. ఒంటి చేత్తో సిక్స్ కొట్టే సామర్థ్యం అతని వశం .. పంత్ కచ్చితంగా ఇంగ్లాండ్ లో రాణిస్తాడని ప్రముఖులు అంటున్నారు .. అయితే రేపు జరగబోయే న్యూజిలాండ్ మ్యాచ్ తో ఏవిదంగా రాణిస్తాడో చూడాలి .. ఇప్పటికే 2 విజయాలు ఖాతాలో వెసుకున్న టీం ఇండియా రెట్టింపు ఉత్సహంతో బరిలోకి దిగుతుంది . అటు న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీద ఉంది .. వార్మ్ అప్ మ్యాచ్ లో కివీస్ పై కంగుతిన్న ఇండియా రేపు జరగబోయే మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకోబోతుంది ..