135 కిలోమీటర్లతో పెనుగాలులు......అతిభారీ వర్షాలు కురుస్తాయట!!

SMTV Desk 2019-06-12 18:35:53  gujarat

అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను మరింత బలపడి పెనుతుపానుగా రూపాంతరం చెందింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలపై దీని ప్రభావం కనిపిస్తోంది. రేపు గుజరాత్ వద్ద వాయు తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 135 కిలోమీటర్లతో పెనుగాలులు, అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. పోరుబందర్, మహువా మధ్యలో ఇది తీరాన్ని తాకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాయు ప్రభావం గుజరాత్ పై తీవ్రస్థాయిలో ఉంటుందన్న నేపథ్యంలో, 36 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. తీరప్రాంతంలో సుమారు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పలు రైళ్లను కూడా రద్దుచేశారు. మరికొన్ని రైళ్ల ప్రయాణ దూరాన్ని కుదించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.