ఈ కమెడియన్ కి ఇంత నోటి దురుసుతనమా?: కోలీవుడ్ వర్గాలు

SMTV Desk 2019-06-12 18:33:54  vadivelu

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమిళ కమెడియన్ వడివేలు మాట్లాడుతూ, శంకర్ కి ఏమీ తెలియదనీ .. ఆయన గ్రాఫిక్స్ గురించి మాత్రమే తెలిసిన దర్శకుడు అని అన్నాడు. అంతేకాకుండా మరో దర్శకుడైన శింబుదేవన్ కూడా అంత సమర్ధుడైన దర్శకుడు కాదంటూ విమర్శలు గుప్పించాడు.

ఆయన ధోరణిపట్ల చాలామంది దర్శకులు అసహనాన్ని ప్రదర్శించారు. దర్శకుడు వెంకట్ ప్రభు ఈ విషయంపై స్పందిస్తూ .. "తమిళ సినిమాను శంకర్ ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. అలాంటి వ్యక్తిని గురించి అలా మాట్లాడకూడదు. ఆయన ప్రతిభాపాటవాలను గురించి ఎవరికీ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక శింబూదేవన్ కూడా గొప్ప దర్శకుడు .. మనసున్న మంచి మనిషి. మీ కెరియర్లో మైలురాళ్లుగా నిలిచిన సినిమాలను అందించిన దర్శకులపై అంత ద్వేషం పనికిరాదు" అని వడివేలును ఉద్దేశిస్తూ అన్నారు.