చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ పై అసభ్యకర కామెంట్లు

SMTV Desk 2019-06-12 18:32:56  kalyan dev

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కు సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో కొందరు అసభ్యకర కామెంట్లు చేశారు. దీనిపై పోలీసులకు కల్యాణ్ దేవ్ ఫిర్యాదు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోల కింద 10 మంది వ్యక్తులు దారుణమైన కామెంట్లు చేస్తున్నారని... తన కుటుంబసభ్యులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అదనపు డీసీపీ రఘువీర్ మాట్లాడుతూ, కల్యాణ్ ను వేధిస్తున్న 10 మందిని గుర్తించామని తెలిపారు. కామెంట్లు చేసిన వారి వివరాలు, ఐపీ అడ్రస్ లు కావాలని ఇన్ స్టాగ్రామ్ కు లేఖ రాశామని... వారి నుంచి వివరాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు.