ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్

SMTV Desk 2019-06-12 18:29:07  ap

ఏపీ శాసనసభాపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇప్పటికే శాసనసభాపతి గా ఖరారైన తమ్మినేని సీతారాం తన నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ కార్యదర్శికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, శాసనసభాపతిగా తమ్మినేని ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. రేపు ఉదయం తొమ్మిది గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ నాయకుడు తమ్మినేని సీతారాం. ఆముదాలవలస నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకూ 6 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా ఆయన పని చేశారు.