ట్రిపుల్ కెమెరాతో ఎల్‌జీ ఎక్స్6

SMTV Desk 2019-06-12 18:25:25  lg x6

ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎల్‌జీ ఎక్స్6 పేరుతో రిలీజ్ అయిన ఈ ఫోన్లో ట్రిపుల్ కెమెరా వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణ. ఎల్‌జీ ఎక్స్6 స్మార్ట్‌ఫోన్‌లో 6.26 అంగుళాల హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 9.0 పై, ఫింగర్‌ప్రింట్ సెన్సర్, మీడియాటెక్ ఎంటీ6762 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా (16 ఎంపీ+5 ఎంపీ+2 ఎంపీ), 13 ఎంపీ సెల్ఫీ కెమెరా, 64 జీబీ మెమరీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఫోన్ ధర దాదాపు రూ.20,000గా ఉంది. ఇది బ్లూ, బ్లాక్ అనే రెండు రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ దక్షిణ కొరియా మార్కెట్‌లో తొలిగా అందుబాటులోకి రానుంది.