పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళలా చేయరు: సర్ఫరాజ్

SMTV Desk 2019-06-12 18:24:32  sarfaraz

ఆదివారం ఆసిస్-ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం కారణంగా ఏడాది నిషేధం ఎదుర్కొన్న స్టీవ్‌ స్మిత్‌ను కించపరిచేలా భారత అభిమానులు చీటర్ చీటర్ అంటూ నినాదాలు చేశారు. ఇది గమనించిన కోహ్లి ఓవర్‌ మధ్యలో వారి వైపు చూస్తూ.. స్మిత్‌ను విమర్శించడం మాని అభినందించండన్నట్లు సంకేతమిచ్చాడు. దీంతో స్మిత్‌ వ్యతిరేక నినాదాలు ఆగిపోయాయి. అయితే ఈ విషయంపై పాకిస్తాన్ జట్టు కాప్టెన్ సర్ఫరాజ్ ను ఓ మీడియా ప్రతినిధి ఒక ప్రశ్న అడిగాడు. ఇదే విధంగా మీ పాకిస్తాన్ అభిమానులు చేస్తే మీరు ఏం చేస్తారు అని అడగడంతో....పాకిస్తాన్ అభిమానులు మాత్రం అలా స్పందించరని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ వాళ్లు అలా చేస్తారని అనుకోను. వాళ్ళు ఇండియా అభిమానుల్లా కాదు. పాకిస్తాన్ ప్రజలకు క్రికెట్ అంటే ఇష్టం. ప్లేయర్లపై ప్రత్యేక అభిమానం చూపిస్తారని తెలిపాడు.