వ్యవసాయ సమస్యలపై పవన్ సమీక్ష..

SMTV Desk 2017-08-29 18:21:39  pawan kalyan, meeting, agriculture students meet pawan kalyan,

హైదరాబాద్ ఆగస్ట్ 29: ఆంధ్రప్రదేశ్ లోని 11 కళాశాలల వ్యవసాయ విద్యార్ధులు మంగళవారం పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్బంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వ్యవసాయ అధికారుల నియమాకాల్లో జివో 16ను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తునానన్నారు. విధి నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు పాటించని అధికారుల వల్ల వ్యవసాయ రంగానికి తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో నకిలీ సర్టిఫికెట్లు పొంది వ్యవసాయశాఖలో ఉద్యోగం చేస్తున్నవారు అనేక మంది ఉన్నారని, దానిని నియంత్రించాలని" డిమాండ్ చేశారు