కొత్త మేనజర్ కోసం పనిమొదలుపెట్టిన హెచ్‌డీఎఫ్‌సీ

SMTV Desk 2019-06-12 18:21:45  hdfc

ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన నూతన మేనజర్ కోసం వెతకడం ప్రారంభించింది. 2020 అక్టోబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వ్యవస్థాపక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదిత్య పురి పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇంత వేగంగా కొత్త మేనజర్ కోసం బ్యాంక్ ఎందుకు వెతుకుతోందంటే కొత్తగా వచ్చే వ్యక్తి బ్యాంక్‌ను మరింత వృద్ధి పథంలో తీసుకెళ్లగలగాలి. అందుకు తగిన సమర్థులను ఎంపిక చేయడం అంత సులువైన పనికాదు. అందుకే ఇప్పటి నుంచే కొత్త బాస్ కోసం పని మొదలెట్టేశారు. నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ బోర్డు త్వరలోనే సెర్చ్ కమిటీని ఏర్పాటు చేస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన 2018-19 వార్షిక నివేదికలో పేర్కొంది. ఇకపోతే వచ్చే ఏడాది ఆదిత్య పురికి 70 ఏళ్లు వస్తాయి. రిటైర్మెంట్ తర్వాత కూడా ఈయన బ్యాంకులో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారనే అంచనాలున్నాయి.