గాయాలు నన్నేమి చేయలేవు: గబ్బర్

SMTV Desk 2019-06-12 18:19:29  shikar dhawan

ఆదివారం ఆసిస్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో అతనికి కనీసం మూడు వారల విశ్రాంతి కావాలని వైద్య నిపుణులు హెచ్చరించారు. అయితే దీనిపై తాజాగా గబ్బర్ స్పందించాడు. ఈ గాయాలు తన పనిని అడ్డుకోలేవని డాక్టర్ రాహత్‌ ఇండోర్ Kabhi mehek ki tarah hum gulon se udte hain పద్యం ద్వారా తెలిపాడు. గాయం నుంచి కోలుకొని మైదానంలోకి అడుగుపెడ్తాననే తన ఉద్దేశాన్ని వెల్లడించాడు. గాయానికి సంబంధించిన ఫొటోలకు ఈ పద్యాన్ని క్యాప్షన్‌గా పేర్కొంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు ముగ్దులైన భారత అభిమానులు.. గబ్బర్‌ను ఆకాశానికెత్తుతున్నారు. గాయమైనా సెంచరీ చేసిన హీరో అంటూ కొనియాడుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్‌ చేస్తున్నారు.