గుండెపోటుతో తమిళ ప్రముఖ నటుడు క్రేజీ మోహన్ మృతి

SMTV Desk 2019-06-11 18:18:06  

ప్రఖ్యాత తమిళ నటుడు.. స్రీన్ ప్లే రైటర్.. డైలాగ్స్ రైటర్ క్రేజీ మోహన్ నిన్న మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. సడెన్ గా ఆయనకు గుండెపోటు రావడంతో కావేరి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆయనకు బ్రతికించేందుకు తీవ్రంగా కృషి చేసినప్పటికీ కాపాడలేకపోయారు.

కాగా క్రేజీ మోహన్ మోహన్ గుండెపోటుతో మరణించాడనే వార్త తెలుసుకున్న తమిళ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. తమిళంలో కమల్ హాసన్ నటించిన ఎన్నో సినిమాలకు క్రేజీమోహన్ డైలాగ్ రైటర్ గా పనిచేశారు. శంకర్ ఇండియన్ సినిమాకు ఆయనే డైలాగులు అందించారు.

అదేవిధంగా హాస్య సంభాషణలలో తనదైన ముద్ర వేసుకున్న క్రేజీ మోహన్ దేశ విదేశాలలో సొంత బ్యానర్‌ క్రేజీ క్రియేషన్స్‌ పై పలు హాస్య నాటకాలు స్వయంగా రచించి ప్రదర్శించారు. 30కి పైగా హాస్య నాటకాలతో వేలాది ప్రదర్శనలిచ్చారు. తెలుగులో అనువాద చిత్రాలు అపూర్వ సహోదరులు , మైఖేల్ మదన కామరాజు , సతీ లీలావతి , భామనే సత్య భామనే , నవ్వండి.. లవ్వండి , రజనీకాంత్ అరుణాచలం సినిమాల తమిళ మాతృకలకు సంభాషణలు రాశారు. తన రచనా శైలితో అటు నాటక రంగ ప్రేక్షకులను, ఇటు సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు క్రేజీ మోహన్. తెలుగులో విజయవంతమైన శంకర్ దాదా ఎంబీబీఎస్ , ఈగ వంటి సినిమాలకు తమిళంలో క్రేజీ మోహన్ సంభాషణలు రాశారు. కేవలం మాటలు అందించడమే కాకుండా ఎన్నో సినిమాల్లో నటించారు కూడా.