బైక్ ప్రియులకు చుక్కలు చూపెట్టిన పోలీసులు

SMTV Desk 2019-06-11 17:55:26  karnataka police destroyed modified bike silencers

కర్ణాటక పోలీసులు బైక్ ప్రియులకు చుక్కలు చూపెట్టారు. వారు ఎంతో ప్రేమగా మోడిఫైడ్ చేసుకున్న బైక్ సైలెన్సర్లను పీకేసి జేసిబితో తొక్కించేసారు. కర్నాటకకు చెందిన పోలీసులు తాజాగా మోడిఫైడ్ సైలెన్సర్లు కలిగిన బైక్స్‌తో పబ్లిక్ రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసేవారికి, జనాలకు విసుగు తెప్పించే వారికి గట్టి ఝలక్ ఇచ్చారు. పెద్దగా సౌండ్ వచ్చే బైక్స్‌ను పట్టుకొని వాటి ఎక్స్‌హాస్ట్‌లను పీకేసి రోడ్డుపై వరుసపెట్టి మరీ ఏకంగా జేసీబీతో నుజ్జినుజ్జి చేశారు. నుజ్జినుజ్జి చేసిన సైలెన్సర్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ ఎక్స్‌హాస్ట్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం. పోలీసులు బైక్ ఓనర్లకు జరిమానా కూడా విధించినట్లు తెలుస్తోంది.