రోజాకు మద్దతుగా రాములమ్మ

SMTV Desk 2019-06-11 17:53:13  roja, vijayashanthi,

ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి.. వైఎస్సార్ సీపీ పార్టీ ఎమ్మెల్యే, సినీనటి రోజాకు మద్దతు పలికారు. కొత్తగా కొలువుదీరిన జగన్‌ మంత్రివర్గంలో ఎమ్మెల్యే రోజాకు స్థానం కల్పించకపోవడంపై ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజా కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని, వారికి కూడా తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని నేను చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో నైనా జగన్ గారు రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను…విజయశాంతి’.. అని ఆమె ట్వీట్ చేశారు.