ఇండిగో సమ్మర్ సేల్‌....టికెట్లపై భారీ డిస్కౌంట్

SMTV Desk 2019-06-11 17:51:11  indigo, indigo summer sale

ప్రముఖ విమాన సంస్థ ఇండిగో తాజాగా టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఇండిగో సమ్మర్ సేల్‌లో భాగంగా దేశీ విమాన టికెట్‌ ధర రూ.999 నుంచి ప్రారంభమౌతోంది. ఇక విదేశీ విమాన టికెట్ధర రూ.3,499 నుంచి ఆరంభమౌతుంది. ఈ ఆఫర్ జూన్ 14 వరకు అందుబాటులో ఉంటుంది.ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుకింగ్ చేసుకున్నవారు జూన్ 26 నుంచి సెప్టెంబర్ 28 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. కంపెనీ ఆఫర్‌లో భాగంగా 10 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచింది. ఇండిగో తగ్గింపు ధరతోపాటు రూ.2,000 క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. ఇండస్ఇండ్ బ్యాంక్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్ పొందాలంటే లావాదేవీ విలువ కనీసం రూ.4,000 ఉండాలి.అదే ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుదారులకు రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. లావాదేవీ విలువ కనీసం రూ.6,000 ఉండాలి. ఇకపోతే టికెట్లకు ఎయిర్‌పోర్ట్ చార్జీలు, ప్రభుత్వ పన్నులు అదనం.