అందాల భామ మరింత బిజీ

SMTV Desk 2019-06-11 17:43:30  Mehreen, Kalyan ram,

సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 సినిమా సూపర్ హెట్ కావడంతో, మెహ్రీన్ కి మరింత క్రేజ్ వచ్చింది. దాంతో ఈ అందాల భామ మరింత బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ వచ్చిన అవకాశాల్లో నుంచి తనకి నచ్చినవాటికి మాత్రమే మెహ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తాజాగా ఆమె కల్యాణ్ రామ్ తో జోడీ కట్టడానికి ఓకే చెప్పేసింది.

ప్రస్తుతం కల్యాణ్ రామ్ .. వేణు మల్లిడి దర్శకత్వంలో తుగ్లక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సతీశ్ వేగేశ్నతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమా కోసమే కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు. ఇంతవరకూ సతీశ్ వేగేశ్న శతమానం భవతి .. శ్రీనివాస కల్యాణం వంటి కుటుంబ కథాచిత్రాలనే తెరకెక్కించారు. ఇప్పుడు చేయనున్న సినిమా యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో మెహ్రీన్ పాత్రకి కూడా ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు.