జగన్ బాటలో నవీన్ పట్నాయక్ .. మాకూ ప్రత్యేక హోదా ఇవ్వండి

SMTV Desk 2019-06-11 17:39:08  Naveen Patnyak, Modi,

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న పట్నాయక్ సార్వత్రిక ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన మోదీకి శుభాకాంక్షలు చెప్పారు. ఇటీవల వచ్చిన ఫొని తుపాను కారణంగా ఒడిశా భారీగా నష్టపోయిందని పట్నాయక్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు.

తమ రాష్ట్రం ఆర్థికంగా వెనుకపడి ఉందన్నారు. కాబట్టి ఒడిశా శరవేగంగా అభివృద్ధి సాధించేందుకు వీలుగా ప్రత్యేక హోదాను ఇవ్వాలని కోరారు. ఓవైపు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీని కోరుతున్న నేపథ్యంలో పట్నాయక్ కూడా అదే పాటను అందుకోవడం గమనార్హం.