పాక్ గగనతలంమీదగా మోడీ ప్రయాణానికి సానుకూల స్పందన

SMTV Desk 2019-06-11 17:35:27  modi travells pakistan sky route

భారత ప్రధాని నరేంద్ర మోడీ పాక్ గగనతలంలో ప్రయాణించేందుకు పాక్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల కిర్గిస్థాన్‌లో జూన్‌ 13, 14 తారీఖుల్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు మోది హజరవుతున్నారు. అందుకే ప్రధాని పాక్‌ అనుమతి కోరింది. ఈ విషయంపై స్పందించిన పాక్‌ సూత్రప్రాయంగా తన అంగీకారాన్ని తెలిపింది. బాలాకోట్‌ దాడుల అనంతరం పాక్‌ తన గగనతలాన్ని మూసివేసింది. ప్రస్తుతం పాక్‌ ఆధీనంలో మొత్తం 11 రూట్లు ఉండగా అందులో కేవలం రెండింటిలో ప్రయాణించేందుకు భారత విమానాలకు అనుమతి ఉంది. ఈ రెండు రూట్లూ కాకుండా ప్రధాని మోది మరో రూట్‌లో ప్రయాణించాల్సి రావటంతో పాక్‌ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.