51 అంతస్థుల భవనంపై కూలిన చాపర్

SMTV Desk 2019-06-11 17:32:11  Helicopter Crash-Lands on Top of Building in New York City, Killing Pilot

అమెరికా: న్యూయార్క్ నగరంలో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 51 అంతస్థుల భవనంపై ఓ చాపర్ కూలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చాపర్ పైలట్ టిమ్ మెక్ కార్ మాక్ మృతి చెందాడు. 2001 సెప్టెంబర్ లో అమెరికా ట్రేడ్ సెంటర్ పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన ఈ సంఘటన ఉగ్రవాదుల దాడి కొవొచ్చన్న భయంతో ప్రజలు వణికిపోయారు. అయితే ఇది ఉగ్రదాడి కాదని, వాతావరణం అనుకూలించక చాపర్ కుప్పకూలిందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో ఆ భవనంలో ఉన్న ఉద్యోగులను ఖాళీ చేయించారు. చాపర్ పూర్తిగా కాలిబూడిదైంది. ప్రమాదం జరిగిన సమయంలో చాపర్ లో ఒక్క పైలట్ మాత్రమే ఉన్నాడని అధికారులు చెప్పారు. పెను ప్రమాదం తప్పడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.