బ్రిటిష్ ప్రధాని థెరెసా మే రాజీనామా…

SMTV Desk 2019-06-09 15:10:32  british , teresa may,

లండన్ : బ్రిటిష్ ప్రధాని థెరెసా మే అధికార కన్సర్వేటివ్ పార్టీ నాయకత్వానికి అంటే ప్రధాని పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. కొత్త నాయకుడు ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తారు. ఐరోపా యూనియన్‌తో బ్రిటన్ చర్చలు జరపడానికి కొత్త నాయకుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బ్రెగ్జిట్ ఒప్పందం విషయంలో పదేపదే విఫలం కావడంతో థెరిసా మే పై ఒత్తిడి పెరిగింది. మే తన రాజీనామా పత్రాన్ని 1922 కమిటీకి అందచేశారు. పార్టీ నాయకునిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కన్సర్వేటివ్ ఎంపి ల నుంచి ఇప్పుడు నామినేషన్లు కోరుతున్నట్టు కమిటీ వెల్లడించింది. మాజీ విదేశాంగ కార్యదర్శి బోరిస్ జాన్సన్, విదేశాంగ కార్యదర్శి జెరెమీ హంట్ , పర్యావరణ కార్యదర్శి మైకేల్ గోవ్ తదితర 11మంది ఆశావాదులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోటీలో విజేత పేరు జూలై 22న వెల్లడించే అవకాశం ఉంది.