మంత్రి ప్రకాశ్‌ పంత్ కి నివాళులర్పించిన రాజ్‌నాథ్‌ సింగ్‌

SMTV Desk 2019-06-09 15:06:58  rajnath singh,

ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి ప్రకాశ్‌ పంత్ కి ఘన నివాళి అర్పించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్‌ సింగ్. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌభేతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్నారు రాజ్ నాథ్ సింగ్. కాగా గత బుధవారం శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ.. టెక్సాక్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ప్రకాశ్ పంత్. ఆయన భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకువచ్చి.. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.