వైరల్ వీడియో ... వరుడి మెళ్లో తాళి కట్టబోయిన పెళ్లికూతురు

SMTV Desk 2019-06-09 15:06:00  thali,

ఎక్కడైన అబ్బాయి అమ్మాయికి తాళి కడతాడు కానీ ఇక్కడ అమ్మాయి అబ్బాయికి తాళి కట్టే ప్రయత్నం చేసే సంఘటన ఇటీవల చోటుచేసుకుంది .. వివరాల్లోకి వెళితే .. వధూవరులు పైకి లేచి నిలబడి ఉండగా, మాంగల్యధారణ మంత్రాలు చదువుతున్న పురోహితుడు అయోమయంతో తాళిని పెళ్లికూతురు చేతికి అందించాడు. ఆమె ఆ తాళిని తన ఎదురుగా నిలుచున్న వరుడి మెడలో కట్టేందుకు సీరియస్ గా ప్రయత్నించగా, ఇంతలో వరుడు అప్రమత్తమై వారించడం వీడియోలో కనిపించింది. దాంతో ఈ లోకంలోకి వచ్చిన పురోహితుడు వధువు చేతినుంచి తాళిని తీసుకుని వరుడికి అందించాడు. వరుడు మూడుముళ్లు వేయడంతో కీలకమైన ఘట్టం ముగిసింది. ఇదంతా చూస్తున్న బంధుమిత్రులు, అతిథులు పడీపడీ నవ్వుకున్నారు.యూట్యూబ్ లో ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా సందడి చేస్తోంది.