అబద్ధాలు చెప్పి, దేశ ప్రజలను మోసం చేసి మోదీ గెలిచారు

SMTV Desk 2019-06-09 15:03:22  modi, Rahul agndhi,

ప్రధాని మోదీ దేశాన్ని, దేశప్రజలను విచ్ఛిన్నం చేసేందుకు విద్వేషపు పూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మూడు రోజుల కేరళ పర్యటనలో ఉన్న రాహుల్ వయానాడ్ లో భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం మాట్లాడిన రాహుల్.. అబద్ధాలు చెప్పి, దేశ ప్రజలను మోసం చేసి మోదీ ఎన్నికల్లో గెలుపొందారని ఆరోపించారు. కాగా మోదీ కూడా కేరళలోని గురువాయుర్ శ్రీకృష్ణ స్వామిని దర్శించుకున్నారు. ఇద్దరు ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రధాన నేతలు ఒకే రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.