సల్మాన్ తో ఉపాసన

SMTV Desk 2019-06-08 18:59:45  salman khan, Upasana

సల్మాన్ తో ఉపాసన ఏంటని షాక్ అవ్వొచ్చు. బాలీవుడ్ కండల వీరుడు వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న సల్మాన్ ఖాన్ లేటెస్ట్ గా భరత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది. సల్మాన్ ఖాన్ స్టామినా చూపేలా భరత్ సినిమా కలక్షన్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో సల్మాన్ ఖాన్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఉపాసన బీ పాజిటివ్ మేగజైన్ కు సల్మాన్ ఖాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

రాం చరణ్ భార్యగానే కాదు బిజినెస్ ఉమెన్ గా ఉపాసన సరికొత్త సర్ ప్రైజెస్ ఇస్తూనే ఉంటుంది. అపోలో గ్రూప్ కు చెందిన బీ బాజిటిక్ మేగజైన్ కు ఎడిటర్ గా పనిచేస్తున్నారు ఉపాసన. ఆ మేగజైన్ కోసం సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేసి వారి ఆరోగ్య రహస్యాలను.. డైట్ ప్లాన్స్ ను రివీల్ చేస్తుంది. సో కండల వీరుడి డైట్ ప్లాన్స్, హెల్త్ టిప్స్ గురించి మీకు తెలియాలంటే ఆ ఇంటర్వ్యూ మీరు చూసేయండి.