అమీర్ పేట్ లో దారుణం ... .. ప్రేమపెళ్లిపై పగ

SMTV Desk 2019-06-08 18:58:29  ameerpet,

ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిని ఓ దుండగుడు కత్తితో దారుణంగా పొడిచేశాడు. హైదరాబాద్ అమీర్ పేటలో పట్టపగలు ట్రాఫిక్ రద్దీ నడుమ అందరూ చూస్తుండగా శుక్రవారం ఈ దారుణం జరిగింది. కుటుంబ సభ్యులతో కలసి వాహనంలో వెళ్తున్న ఇంతియాజ్ అనే యువకుడిని ఓ దుండగుడు బయటికి లాగి విచక్షణా రహితంగా పొడిచాడు.కొందరు అడ్డుకున్నా ఫలితం లేకపోయింది. క్షతగాత్రుణ్ని అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ప్రేమించ పెళ్లి చేసుకున్నందుకు కొందరు తమ అబ్బాయిపై పగబట్టారని, వారే ఈ దాడి చేయించారని ఇంతియాజ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ జరిగిందని, స్టేషన్ నుంచి బయటికి రాగానే దాడి చేశారని వాపోయారు. దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.