మూవీ ఫ్లాప్ అని ఒప్పుకున్న హీరో

SMTV Desk 2019-06-08 18:57:46  Hero SUrya,

ఈమధ్య హీరోలు తమ సినిమాలు ఆడియెన్స్ అంచనాలకు రీచ్ అవ్వకుంటే ప్రమోషన్స్ చేసి వారి మీదకు రుద్దకుండా సినిమా రిజల్ట్ గురించి జెన్యూన్ గా ఓపెన్ అవుతున్నారు. మొన్నామధ్య రాం చరణ్ వినయ విధేయ రామ సినిమాకు ఇలానే మెగా అభిమానుల కోసం ఓ లెటర్ రాశాడు. ఈమధ్య అల్లు శిరీష్ కూడా ఏబిసిడి సినిమా రిజల్ట్ గురించి ట్వీట్ చేశాడు. లేటెస్ట్ గా కోలీవుడ్ హీరో సూర్య కూడా రీసెంట్ గా రిలీజైన అతని సినిమా ఎన్.జి.కే పై ట్వీట్ చేశాడు.

ఎన్.జి.కే సినిమాపై మీ ప్రేమ, ఆలోచనలు, అభిప్రాయాలను గౌరవిస్తున్నా.. అంతేకాదు సినిమాను డీకోడ్ చేసిన వారికి మెచ్చుకున్న వారికి ధన్యవాదాలు. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశాడు సూర్య. సో అభిప్రాయం గౌరవిస్తున్నా అంటే సినిమా ఫ్లాప్ అని సూర్య కూడా ఒప్పుకున్నట్టే లెక్క. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఎన్.జి.కే సినిమాను సెల్వరాఘవన్ డైరెక్ట్ చేయగా సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా తర్వాత కెవి ఆనంద్ డైరక్షన్ లో సూర్య కాప్పాన్ సినిమా చేస్తున్నాడు.