నాగబాబు, రోజా రీ ఎంట్రీ.. జబర్దస్త్ జోష్..

SMTV Desk 2019-06-08 18:57:08  jabardasth, nagababu,

మెగా బ్రదర్ నాగబాబు, రోజా ఇద్దరికి జబర్దస్త్ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అంతేకాదు ఐదేళ్లలో వారికి రెమ్యునరేషన్ గా భారీగానే ముట్టినట్టు తెలుస్తుంది. ఈటివిలో సూపర్ సక్సెస్ అయిన జబర్దస్త్ షోలో కమెడియన్స్ వారి టాలెంట్ చూపిస్తున్నారు. గురు, శుక్రవారాలు వచ్చాయంటే చాలు బుల్లితెర ప్రేక్షకులు టివిలకు అతుక్కుపోయేలా చేశారు. ఏపిలో ఎలక్షన్స్ వల్ల నాగబాబు, రోజా ఇద్దరు జబర్దస్త్ కు దూరమయ్యారు. వారు లేని టైంలో మీనా, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సంఘవి ఇలాంటి వారిని తెచ్చి షో నడిపించారు.

అయితే గత రెండు వారాలుగా రోజాతో ఆలి కనిపించాడు. నాగబాబు దాదాపుగా రావడం కష్టమే అందుకే ఆలిని ఫిక్స్ చేశారని అనుకున్నారు. కాని సీన్ రివర్స్ అయ్యింది. వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో నాగబాబు, రోజా ఇద్దరు షోలో కనిపించారు. హైపర్ ఆది జడ్జులుగా మీరు పర్ఫెక్ట్ అని వాళ్లని సూర్య చంద్రులుతో పోల్చుతూ స్కిట్ కూడా చేశాడు. రాజకీయాల పరంగా ఎలా ఉన్నా మళ్లీ జబర్దస్త్ షోలో నాగబాబు, రోజా జడ్జులుగా రావడం షోకి నిండుతనం తెచ్చి పెట్టింది.