రోజా కి జబర్దస్త్ షాక్ ఇచ్చిన జగన్

SMTV Desk 2019-06-08 18:56:35  jagan, roja,

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గంలో మంత్రుల పేర్లను, స్పీకర్ పేరును ఖరారు చేశారు. అయితే పార్టీ సీనియర్ నేత, జగన్‌ తరపున చంద్రబాబునాయుడుపై నిత్యం విరుచుకుపడే నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రివర్గంలో స్థానం లభించకపోవడం ఆమెకు పెద్ద షాక్. పార్టీ ఎమ్మెల్యేలలో ఖచ్చితంగా మంత్రి పదవి లభించేవారిలో రోజా పేరు ప్రధానంగా ఉండేది. కానీ జగన్ ఎందుకో ఆమెను పక్కన పెట్టారు. దీనిపై రోజా ఇంకా స్పందించవలసి ఉంది.