సవతి భార్యల రచ్చ .. దేనికో తెలిస్తే షాక్

SMTV Desk 2019-06-08 18:55:23  savathi,

భర్త శవం తనంకంటే తనకని ఇద్దరు సవతి భార్యలు పోట్లాడుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఉదాంతం తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న సెంథిల్‌ కుమార్‌, విజయ దంపతులు. వీరికి ఓ కూతురు సంతానం. అయితే మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. భార్యతో విడిపోయిన సెంథిల్ అదే యూనివర్సిటీలో పనిచేస్తున్న మహేశ్వరి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం లేదు.

అయితే బుధవారం రాత్రి విధుల్లో ఉన్న సెంథిల్‌ గుండెపోటుకు గురై మృతించెందాడు. ఈ విషయం తెలుసుకున్న రెండో భార్య మహేశ్వరి అంత్యక్రియల నిమిత్తం భర్త మృతదేహాన్ని ఇంటికి చేర్చింది. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య విజయ అక్కడికి వెళ్ళింది. దీంతో విడాకులు ఇచ్చిన నీకు భర్త మరణంతో సంబంధం ఏమిటని మహేశ్వరిని వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగగా.. బంధువులు చేసేది లేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సెంథిల్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరి మధ్య సంధి ఫలించకపోవడంతో పోలీసులు.. విద్యుత్‌ శ్మశానవాటికలో విజయ కుమార్తె తన తండ్రికి అంత్యక్రియలు చేయవచ్చని తీర్మానం చేశారు. దీంతో సెంథిల్‌కుమార్, ఇద్దరు భార్యలు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు.