చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన 'తేజ' హీరోగా ఎంట్రీ

SMTV Desk 2019-06-08 18:54:18  teja, tfi entry,

ఇంద్ర సినిమాలో తొడగొట్టిన చిన్న పిల్లాడు గుర్తున్నాడా.. మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన తేజ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంద్ర సినిమాలో అలరించిన చిన్న చిరంజీవి పెద్దవాడు అయ్యాడు. అయితే దానికిముందే సమంత నటించిన ఓ బేబీ సినిమాలో నటించాడు. నందిని రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఓ బేబీ సినిమాలో సమంత మనవడిగా నటించాడు తేజ.

ఈ కుర్రాడు ఇప్పుడు హీరోగా కూడా సినిమా మొదలవుతుందట. తేజ హీరోగా ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. ఇంతలోనే ఓ బేబీ ఆఫర్ రాగానే చేశాడు. మొత్తానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన తేజ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే చైల్డ్ ఆర్టిస్టులు హీరోగా మారిన వారిలో సక్సెస్ రేటు చాలా తక్కువే ఉంది. అందులో స్టార్ తనయులుగా మహేష్, ఎన్.టి.ఆర్ కెరియర్ సూపర్ గా ఉన్న తనీష్, తరుణ్ వంటి వాళ్లవి మాత్రం నిరుత్సాహంగానే ఉంది. మరి తేజ హీరోగా నిలబడతాడా లేదా అన్నది చూడాలి.