సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక..రచ్చ లేపుతున్న 'దిమాక్ ఖరాబ్' సాంగ్

SMTV Desk 2019-06-08 18:53:38  ismart shnaker,

యంగ్ హీరో రామ్ , పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ రూపొందుతోంది. అందాల భామలు నిధి అగర్వాల్ - నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి దిమాక్ ఖరాబ్ అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక .. పిలగా పిలగా పిలగా పెట్టిపోరా సురక .. " అంటూ ఈ పాట మొదలవుతోంది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని, ఇద్దరు కథానాయికల కాంబినేషన్లో రామ్ పై చిత్రీకరించిన పాట ఇది. మణిశర్మ సంగీతం .. కాసర్ల శ్యామ్ సాహిత్యం .. కీర్తన శర్మ - సాకేత్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ కి హిట్ పడటం ఖాయమనే అభిప్రాయంలో ఆయన అభిమానులు వున్నారు. వాళ్ల ఆశలను పూరి నిజం చేస్తాడేమో చూడాలి మరి.