ఊరికి ఒకేఒక్క మొనగాడు.. తన పింఛన్‌తో నదిపై వంతెన..

SMTV Desk 2019-06-08 18:52:54  orissa,

ఒడిశా : కియోంఝర్ జిల్లాలో సాలంది అనే కుగ్రామం గ్రామం ఉంది. 1200 మంది నివసించే ఆ గ్రామంలో కనీస సౌకర్యాలు లేవు. వారు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే వారి గ్రామం వద్ద ఉన్న పెద్దవాగును దాటాల్సిందే. ఈ వాగుపై వంతెన నిర్మించాలని ఆ గ్రామ ప్రజలు అధికారులను కోరుతూ వచ్చారు. కానీ ఏ అధికారి వారి సమస్యను పట్టించుకోలేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో గంగాధర్ రూట్ అనే వ్యక్తి వాగుపై వంతెన నిర్మాణానికి పూనుకున్నాడు. ఎవరినీ డబ్బు ఆశించకుండా ఆయన తన పెన్షన్ డబ్బులతో వంతెన నిర్మాణం చేపట్టాడు. ప్రస్తుతం ఆ వంతెన నిర్మాణం పూర్తి కావచ్చింది. మొదట ఆ వంతెనను రూ.3లక్షల రూపాయలతో నిర్మించడం ఆరంభించారు. ఆ డబ్బు ఏ మాత్రం సరిపోకపోవడంతో వంతెన పనులు ఆగిపోయాయి. దీంతో రిటైర్డ్ ఉద్యోగి అయిన గంగాధర్ రూట్ 2016లో వంతెన నిర్మాణపు పనులను ప్రారంభించాడు. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావచ్చిందని గంగాధర్ రూట్ తెలిపారు. తన పిల్లలు స్థిరపడ్డారని, ఈ వంతెన పూర్తి చేస్తే గ్రామ ప్రజలకు అవస్థలు తప్పుతాయని గంగాధర్ రూట్ పేర్కొన్నారు. దీంతో ఆ గ్రామ ప్రజలు గంగాధర్ రూట్ ను హీరో అంటూ కొనియాడుతున్నారు.