బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న సల్మాన్ ఖాన్ భారత్

SMTV Desk 2019-06-08 18:52:10  salman khan, katrinakaif, bharath

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా భారత్ బుధవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన ఈసినిమా థియేటర్ల వద్ద భారీ కలెక్షన్ సునామీని సృష్టిస్తుంది.

అలాగే.. రిలీజైనప్పటి నుంచి ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటిరోజు దేశవ్యాప్తంగా 42 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా గురువారం వర్కింగ్ డే అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా అంతే రేంజ్ లో దూసుకుపోయి ఏకంగా 31 కోట్లు రాబట్టింది. దీంతో రెండు రోజులకు కలిపి 73 కోట్ల రూపాయల్ని ఖాతాలో వేసుకున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా.. రేపు, ఎల్లుండి వీకెండ్ కావడంతో వసూళ్లు మరింత పెరగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో కత్రినా కైఫ్, దిశా పఠానీలు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే.