ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో జగన్‌ భేటీ

SMTV Desk 2019-06-08 18:51:33  Jagan, Narasimhan,

ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే విజయవాడ చేరుకున్న గవర్నర్‌ను గేట్‌వే హోటల్‌లో కలిసిన ముఖ్యమంత్రి జగన్‌ రేపు ప్రమాణస్వీకారం చేయబోయే మంత్రుల జాబితాను ఆయనకు అందజేశారు.

అయితే శనివారం రోజు ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సచివాలయం ఆవరణలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే జగన్ కాబోయే మంత్రుల జాబితాను గవర్నర్ కు అందజేశారు. వెంటనే గవర్నర్ కూడా వాటిని ఆమోదించారు. కాగా కాసేపట్లో మంత్రుల జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.