సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సమంత ..

SMTV Desk 2019-06-08 18:50:43  samantha , oh beby,

పెళ్లి తర్వాత జబర్దస్త్ గా తన కెరియర్ కొనసాగిస్తున్న సమంత ప్రస్తుతం ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ తో వస్తున్న ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత తన డ్రీం రోల్ గురించి ప్రస్థావించారు. తనకు ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ అంటే చాలా ఇష్టమని.. అలాంటి సినిమా చేసి తాను రిటైర్ అవుతానని అంటుంది సమంత.

ఓ బేబీ సినిమాలో సమంత పాత్ర కామెడీ టచ్ ఉంటుంది. అయితే అది కొద్దిసేపు మాత్రమే సమంత మాత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయాలని అంటుంది. సమంత చేయాలనుకోవాలే కాని మన దర్శకులు ఆమె కోసం అలాంటి కథలు రాసేయరు. మజిలీ సూపర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న సమంత ఓ బేబీతో కూడా హిట్ కొట్టడం గ్యారెంటీ అంటుంది. ఈ సినిమాలో నాగ శౌర్య హీరోగా నటిస్తున్నాడు.