బ్రిస్టల్ లో ఎడతెరిపి లేకుండా వాన

SMTV Desk 2019-06-08 16:42:10  briston, rain,

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో వరుణుడు అప్పుడప్పుడు తన ప్రభావం చూపిస్తున్నాడు. తాజాగా, పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య బ్రిస్టల్ లో జరగాల్సిన మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. బ్రిస్టల్ లో ఎడతెరిపి లేకుండా వాన పడుతుండడంతో మైదానం తడిసి ముద్దయింది. భారీ వర్షం కాకపోయినా, అదేపనిగా కురుస్తుండడంతో మైదానం చిత్తడిగా మారింది. వరుణుడి ధాటికి మ్యాచ్ లో కనీసం టాస్ వేయడానికి కూడా సాధ్యపడలేదు. ఈ మ్యాచ్ రద్దయితే పాకిస్థాన్, శ్రీలంక జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.