ధోని ఇంట్లో చోరీ ..

SMTV Desk 2019-06-08 16:13:59  Dhoni, MS Dhoni, theft,

ఢిల్లీ : నోయిడాలో కొంతకాలంగా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. నోయిడాలోని సెక్టార్ 104 ఖరీదైన ప్రాంతం. ఇటువంటి ఈ ప్రాంతంలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఖరీదైన ఇల్లు ఉంది. రాంఛీలో నివాసం ఉండే ధోనీ నోయిడాలోని తన ఇంటిని విక్రమ్ సింగ్ అనే వ్యక్తికి కిరాయికి ఇచ్చాడు. ఈ క్రమంలో దొంగలు ఈ ఇంట్లో చొరబడి ఖరీదైన ఎల్ఇడి టివితో పాటు పలు వస్తువులను చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో దొంగల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులు అరెస్టు చేశారు. వారి నుంచి టివిలు, ల్యాప్ టాప్ లు, ఇన్వర్టర్లు స్వాధీనం చేసుకున్నారు.