ధోనీ ఆ గ్లౌజు తీయాల్సిన అవసరం లేదు

SMTV Desk 2019-06-08 16:09:16  Dhoni,

లండన్: వరల్డ్ కప్ సందర్భంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ టీమిండియా కీపర్ ఎంఎస్ ధోనీ ధరించిన గ్లౌజుపై చర్చ జరుగుతోంది. సదరు గ్లౌజుపై బలిదాన్ గుర్తు ఉండడంతో తొలగించాలని బిసిసిఐకి ఐసిసి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఐసిసిపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతన్నారు. ఈ సందర్భంగా ధోనీకి ఆ గ్లౌజు తీయాల్సిన అవసరం లేదని వెల్లడించింది. దోనీ గ్లౌజుపై ఉంది ఆర్మీ గుర్తు కాదని సిఒఎ చీఫ్ వినోద్ రాయ్ మీడియాతో తెలిపాడు. ఐసిసి సూచనలు, నిబంధనలు ధోనీ ఎక్కడ అతిక్రమించలేదని బిసిసిఐ పేర్కొంది. వరల్డ్ కప్‌లో టీమిండియాను ఆడనివ్వకపోతే తిరిగిరావాలని అభిమానులు సూచిస్తున్నారు. ధోనీ ఆ గుర్తు ఉన్న గ్లౌజును తీయొద్దని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.