రూ. 1800 కడితే నోట్లో పెట్టి తినిపిస్తారు, తాగిస్తారు

SMTV Desk 2019-06-08 16:08:34  London hotel, hatsoff,

ఈ రోజుల్లో అందరు సుఖానికి అలవాటు పడ్డారు.. అయితే వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఓ హోటల్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.కస్టమర్లను తామే స్వయంగా నోట్లో పెట్టి మరీ తినిపిస్తామని, తాగిస్తామని చెబుతోంది. లండన్ నగరంలోని బ్లాండ్ ఫోర్డ్ స్ట్రీట్ నంబర 7లో ఉన్న ‘హాండ్స్ ఆఫ్’ అని పాప్ రెస్టారెంటులో వచ్చే వారం ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులోకి రానుంది. కస్టమర్లు రూ. 1800 కడితే రెస్టారెంట్ సిబ్బందే స్వయంగా తినిపిస్తారు. కూల్ డ్రింక్స్ కూడా తాగిస్తారు. మూతిముక్కు కూడా చక్కగా తుడిచేస్తారు. ఫోన్ పిచ్చి ఉన్న కస్టమర్లయితే ఎంచక్కా చాటింగ్ చేస్తూనో, వీడియోలు చూస్తూనే గడిపేయొచ్చు. ఈ ఆఫర్ కేవలం వెరైటీ కోసం మాత్రమే కాదు. దీని వెనుక మంచి ఉద్దేశం కూడా ఉంది. పేదల పిల్లకు కాస్త తిండి పెట్టే ‘మేరీస్ మీల్’ పథకంలో భాగంగా దీన్ని నిర్వహిస్తున్నారు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును ఆ పథకానికి అందజేస్తారు.