త్రివిక్రమ్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన హాట్ భామ

SMTV Desk 2019-06-08 15:57:48  niveda pethuraj,

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ తాజా చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటోంది. కథా పరంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరమట. ప్రధాన కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నారు.

మరో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దక్కనుందా అనే ఆసక్తి అందరిలోను నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని నివేదా పేతురాజ్ దక్కించుకుంది. తాజా షెడ్యూల్ షూటింగులోను ఆమె పాల్గొంది. సాయిధరమ్ తేజ్ జోడీగా చిత్రలహరి సినిమా ద్వారా నివేదా పేతురాజ్ తెలుగు తెరకి పరిచయమైంది. రెండవ సినిమాతోనే ఆమె త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్లో అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం.