నాన్‌వెజ్ ప్రియులకు ప్యారడైజి బిర్యానీ బంపర్ ఆఫర్

SMTV Desk 2019-06-08 15:55:54  Paradise biryani,

హైదరాబాద్: బిర్యానీ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ముఖ్యంగా నాన్‌వెజ్ ప్రియులు అయితే వారానికి ఒక్కసారైనా బిర్యానీ రుచి చూడాల్సిందే. మీరు ఇప్పటికే అనేక రకాలైన బిర్యానీలు తిని ఉంటారు. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ప్యారడైజి బిర్యానీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలోని ప్యారడైజ్ హోటల్ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రపంచకప్‌ 2019 టోర్నీ సందర్భంగా క్రికెట్‌ ప్రియులకు కోసం #WorldCupWithParadise అనే పోటీని నిర్వహించనుంది. ఈ పోటిలో విజేతలుగా నిలిచిన వారికి ఒక సంవత్సరం పాటు వారానికి ఒక బిర్యానీ చొప్పున మొత్తం 52 వారాలు ఉచితంగా బిర్యానీని ఇవ్వనుంది. ఈ పోటీ జూన్ 7 నుంచి జూలై 18వ తేదీ 2019 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు హోటల్ నిర్వహాకులు ఓ ప్రకటనలో వెల్లడించారు.