రేపు ఉదయం 8.39 గంటలకు సచివాలయంకు వైఎస్ జగన్

SMTV Desk 2019-06-08 15:55:18  jagan mohan reddy,

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. రేపు ఉదయం 8.39 గంటలకు సచివాలయంకు వెళ్లనున్నట్టు స్థానిక సమాచారం. సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం కార్యాలయం ఉంది. ఇదిలా ఉండగా, రేపు ఉదయమే కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సచివాలయం సమీపంలోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం కేబినెట్ తొలి భేటీ జరగనున్నట్టు సమాచారం.