మోడీ టీం లోకి జెసి దివాకర్ రెడ్డి ?

SMTV Desk 2019-06-07 17:12:52  JC divakar reddy,

జెసి దివాకర్ రెడ్డి కుటుంబం బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి. రాయలసీమలో తిరుగులేని రాజకీయ శక్తిగా జెసి కుటుంబం ఎదిగింది. మొదటగా కాంగ్రెస్ లో ఉన్న జెసి కుటుంబం 2014 ఎన్నికల సమయం టిడిపిలో చేరింది. జెసి దివాకర్ రెడ్డి ఎంపిగా, ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి ఎంఎల్ఎ గా గెలిచారు. 2019 ఎన్నికల్లో జెసి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు తమ వారసులను బరిలోకి దించారు. అయితే వారికి ఉహించని విధంగా పరాజం ఎదురైంది. దీంతో తమ వారసుల రాజకీయ భవిష్యత్ ను ఉంచుకుని బిజెపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జెసి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు బిజెపి జాతీయ కార్యదర్శి రామ్ మాధవ్ తో చర్చించారని, మంచి ముహూర్తం చూసుకుని బిజెపి చీఫ్, కేంద్రహోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు జెసి అనుచర వర్గం చెబుతోంది. అయితే బిజెపిలో చేరే విషయంపై జెసి కుటుంబం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. అనంతపురం జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల్లో వైసిపి 12 స్థానాలను గెలుచుకుంది. ఈ క్రమంలోనే తమ వారసుల రాజకీయ భవిష్యత్ కోసం జెసి కుటుంబం బిజెపిలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు వీరితో పాటు అనంతపురానికి చెందిన పలువురు టిడిపి నేతలు సైతం బిజెపిలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.