ధోనీ గ్లౌజుపై మండిపడిన పాక్ మంత్రి

SMTV Desk 2019-06-07 17:08:40  ms dhoni,

లండన్: వరల్డ్ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాపై భారత జట్టు గెలిచింది. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ వేసుకున్న గ్లౌజులపై పాక్ మంత్రి మండిపడ్డాడు. పాకిస్థాన్ మంత్రి ఫవద్ చౌదరి… ధోనీ క్రికెట్ ఆడేందుకు ఉన్నాడని, మహాభారతం కోసం కాదని ఎద్దేవా చేశారు. ఇండియాలో ఓ వర్గం మీడియా యుద్ధం కావాలని కోరుకుంటుందని, అలాంటి వారిని సిరియా, అఫ్ఘనిస్తాన్, రవాండాకు తరలించాలని తన టీట్టర్ లో ఫవద్ ట్వీట్ చేశాడు. ధోనీ గౌజులపై “ఆర్మీ బలిదాన్” గుర్తు ఉండడంతో సోషల్ మీడియాతో వైరల్ మారాయి. అభిమానులు ధోనీ ప్రశంసిస్తూ పెద్ద ఎత్తున రీట్వీట్లు చేశారు. ధోనీ గ్లౌజులపై ఉన్న గుర్తులను తీసేయాలని బిసిసిఐకి ఐసిసి సూచించింది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో లెప్టినెంట్ కల్నల్ హోదా ధోనీ కలిగి ఉన్నాడు. ధోనీ ఆ గ్లౌజు ధరించి ఆడాలని భారత అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు.