భారతీయ అమెరికన్లకు చుక్కలు చూపెట్టిన లేడి థెఫ్ట్ అరెస్ట్!

SMTV Desk 2019-06-07 17:04:47  lady theft, america

వాషింగ్టన్‌: అమెరికాలో భారతీయ అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని గత నాలుగేళ్ల నుంచి చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళను మిచిగాన్‌ న్యాయస్థానం ఎట్టకేలకు బుధవారం ఆమెను దోషిగా తేల్చింది. చాకో క్యాస్ట్రో అనే మహిళ దొంగల ముఠాను ఏర్పాటు చేసుకుని 2011-14 మధ్య దేశవ్యాప్తంగా భారీ చోరీలకు పాల్పడింది. వారికి భారత అమెరికన్లు, ఆసియా ప్రజలే గురిగా తన ముఠా సభ్యులతో చోరీలకు పాల్పడింది. ఏయే వస్తువులను దొంగిలించాలనేది ముందుగానే జాబితా రూపొందించి, తన ముఠా సభ్యులకు పురమాయించేది, ఆ ప్రాంతాన్ని కూడా ఆమే నిర్ధేశించేదట. వీరు ముసుగు ధరించి, ఆయుధాలను వెంట తీసుకెళ్లి ఇళ్లల్లో వాళ్లను బెదిరించి ,నగదు, ఆభరణాలు, విలువైన ఎలక్ట్రానిక్‌ సామగ్రిని ఎత్తుకుపోయేవారు అని న్యాయస్థానం తేల్చింది, గ్యాంగ్‌ లీడర్‌తో సహా ముఠా సభ్యులందరికి సెప్టెంబరులో శిక్ష విధించనుంది.