టోర్నీలో ఆడేందుకు డివిలియర్స్‌ విశ్వప్రయత్నాలు!

SMTV Desk 2019-06-07 17:03:11  ab de villiers

లండన్‌: సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఏబి డివిలియర్స్‌ గత ఏడాది రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ మెగా టోర్నీలో ఆడేందుకు డివిలియర్స్‌ విశ్వప్రయత్నాలు చేశాడు కాని ఫలించలేదు. టీం యాజమాన్యం ఆయన ప్రతిపాదనను తోసిపుచ్చింది. వరల్డ్‌కప్‌లో సఫారీలు వరుసగా మూడు మ్యాచ్‌లను ఓడిపోయింది. దీంతో ఆ జట్టు తీవ్ర గందరగోళంలో పడింది. డివిలియర్స్‌ ఉంటే బాగుండేదేమో అనే వాదనలు వినిపిస్తున్నట్లు సమాచారం. అయితే జట్టులోని 15 మంది సభ్యుల బృందం ఇంగ్లండ్‌కు బయలుదేరే 24 గంటల ముందు డివిలియర్స్‌ ఈ ప్రయత్నం చేసినట్లు తాజాగా వెల్లడైంది. డివిలియర్స్‌ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకున్నా..సఫారీ బోర్డు మాత్రం డివిలియర్స్‌కు అవకాశం ఇవ్వలేదు.